పుణెకు షాకిచ్చిన ఢిల్లీ…

279
Delhi keep Pune waiting for playoff spot
- Advertisement -

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో పుణెక్ ఢిల్లీ గ‌ట్టిషాకిచ్చింది. ప్లే ఆఫ్‌కి చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పుణె బ్యాట్స్ మెన్ చేతులేత్తేశారు. దీంతో 7 ప‌రుగుల తేడాతో జ‌హర్ సేన విజ‌యం సాధించింది.169 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పుణె లక్ష్యాన్ని చేధించలేకపోయింది.

ఓపెనర్లు రహానె (0), త్రిపాఠి (7)ల వికెట్లు త్వరగా కోల్పోయింది. ఐతే కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ (38; 32 బంతుల్లో 4×4, 1×6), మనోజ్‌ తివారి నిలకడగా ఆడి పుణెను రేసులోకి తెచ్చారు. 9 ఓవర్లకు 74/2తో ఆ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ స్థితిలో స్మిత్‌ ఔటైనప్పటికీ.. స్టోక్స్‌ (33; 25 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి తివారి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరూ మంచి వూపుమీదుండగా.. 27 బంతుల్లో 44 పరుగులే చేయాల్సి రావడంతో పుణె అలవోకగా గెలిచేలా కనిపించింది. ఐతే షమి.. స్టోక్స్‌ను ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తర్వాతి ఓవర్లో అండర్సన్‌ ఐదే పరుగులివ్వడంతో పుణెపై ఒత్తిడి పెరిగిపోయింది. కమిన్స్‌ వేసిన తర్వాతి ఓవర్లో ధోని (5) రనౌటైపోయాడు. ఈ ఓవర్లోనూ ఐదే పరుగులొచ్చాయి. క్రిస్టియన్‌ (3) కూడా నిలవకపోవడంతో పుణె ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది.

Delhi keep Pune waiting for playoff spot
చివరి 6 బంతుల్లో 25 పరుగలు చేయాల్సి ఉండగా, కమిన్స్ వేసిన అన్ని బంతులను ఎదుర్కొన్న మనోజ్ తివారీ (60) తొలి రెండు బంతుల్లో వరుసగా సిక్సర్లు బాదాడు. తర్వాత మరో ఫోర్ కొట్టాడు. చివరి బంతికి 8 పరుగులు చేయాల్సి ఉండగా క్లీబ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తివారీ హాఫ్ సెంచరీ వృధా గా అయిపోయింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ.. ఫామ్‌లో ఉన్న శాంసన్‌ (2), శ్రేయస్‌ అయ్యర్‌ (3)ల వికెట్లు కోల్పోయి 3 ఓవర్లకు 11 పరుగులే చేసింది. ఈ దశలో కరుణ్‌ నాయర్‌ దిల్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మొదట రిషబ్‌ పంత్‌ (36; 22 బంతుల్లో 4×4, 2×6).. తర్వాత శామ్యూల్స్‌ (27; 21 బంతుల్లో 1×4, 2×6) అతడికి సహకారమందించారు. పంత్‌ ఉన్నంతసేపూ ధాటిగా ఆడాడు. కరుణ్‌ కూడా బ్యాట్‌ ఝులిపించడంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 168 ప‌రుగులు చేసింది.బ్యాటింగ్‌లో రాణించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన క‌రుణ్ నాయ‌ర్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

- Advertisement -