ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో పాటు మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ నోటీసులు పంపింది.
ఇటీవల ట్రయల్ కోర్టు ఈ కేసులో ఉన్న 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పులో సీబీఐ దర్యాప్తుపై కొన్ని విమర్శాత్మక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
Also Read:ఇంట్రెస్టింగ్‌గా విక్రమ్ ఆన్ డ్యూటీ!
సీబీఐ పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై తాత్కాలికంగా స్టే విధించింది. అలాగే కేసులో నిర్దోషులుగా ప్రకటించబడిన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసి వారి స్పందన కోరింది.
ఈ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేయాలని, అలాగే దర్యాప్తు సంస్థపై చేసిన వ్యాఖ్యలను తొలగించాలని సీబీఐ హైకోర్టులో విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణలో ఈ అంశాలపై సమగ్రంగా పరిశీలించే అవకాశం ఉంది. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోవడంతో దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది.

