సెంట్రల్ విస్టా పనులు ఆపలేం..

29
central vista

మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పార్లమెంట్ కొత్త భవం సెంట్రల్ విస్టా పనులను ఆపలేమని స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని తెలిపిన హైకోర్టు…పిటిషనర్‌కు జరిమానా విధించింది.

పిటిష‌నర్ల‌కు రూ.ల‌క్ష‌ల జ‌రిమానా విధించిన హైకోర్టు…సంబంధిత డీడీఎంఏ ఆదేశాల గురించి కోర్టు ప్ర‌స్తావిస్తూ.. ప‌నులు నిషేధించాల్సిందిగా అందులో ఎక్క‌డా లేద‌ని స్ప‌ష్టం చేసింది.

సెంట్రల్ విస్టా ప్రత్యేకతలు..

() 64 వేల 500 చదరపు మీటర్ల వైశాల్యంలో కొత్త పార్లమెంట్ ఉండనుంది. ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే 17వేల చదరపు కిలోమీటర్లు పెద్దగా ఉండనుంది. 2022 ఆగస్టులో జరిగే దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కొత్త పార్లమెంట్ భవనంలోనే నిర్వహించాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే నిర్మాణ పనులు జరిగేలా ప్రణాళికను సిద్దం చేశారు.

() దేశ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా, ప్రతి అడుగులో భారతీయత ఉట్టిపడేలా నిర్మాణం ఉండనుంది. పురివిప్పి ఆడుతున్న జాతీయపక్షి నెమలి ఆకృతిలో లోక్‌సభ పైకప్పు, విరబూసిన జాతీయ పుష్పంకమలం రూపంలో రాజ్యసభ పైకప్పు, పార్లమెంట్‌లో అంతర్భాగంగా నిలువనున్న జాతీయ వృక్షం మర్రిచెట్టు రూపంలో తీర్చిదిద్దనున్నారు.

()ఒకే సారి 1,224 మంది ఎంపీలు కూర్చుకోవడానికి అనుగుణంగా పార్లమెంట్ నిర్మిస్తున్నారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా సీటింగ్ ఉండనుంది.

()భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం, బహుళ కమిటీలకు గదులు, భోజనశాలలు, లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా, సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు సైతం ఉండనున్నాయి. మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలకు 480 సీట్లు చొప్పున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడికి 40 చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ ను శ్రమ శక్తి భవన్ లో ఏర్పాటు చేయనున్నారు. శ్రమ శక్తి భవన్ 2024 నాటికి పూర్తవుతుంది.

()గ్యాలరీల్లో కూర్చునే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీల కోసం రెండు గేట్లు, ఎంపీల వాహనాలు వచ్చేందుకు మరో రెండు, సాధారణ ప్రజలు, మీడియా, సందర్శకుల కోసం మరో రెండు భవనానికి గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. నూతన భవనంలో అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.