బంపర్ ఆఫర్‌.. మొక్కలు నాటితే కేసు మాఫీ

488
- Advertisement -

విద్యుత్ చోరి కేసులో ఓ వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 50 మొక్కలు నాటితే విద్యుత్ చోరీ కేసును మాఫీ చేస్తామని ప్రకటించింది. మొక్కలు నాటేందుకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ ఆఫర్ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీలోని ఓ వ్యక్తి తన షాపు నుంచి ఓ వైరును విద్యుత్‌ పోల్‌కి సెట్ చేసి ఫ్రీగా కరెంట్ సదుపాయాన్ని పొందుతున్నాడు. ఇది గమనించిన విద్యుత్ అధికారులు అతడిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్ధానం 50 మొక్కలను నాటాలని సూచించింది.

ఏఏ మొక్కలు నాటాలో కూడా చెప్పింది. నాటాల్సిన 50 మొక్కల్లో ఒక్కటి తగ్గినా తిరిగి చోరీ కేసు విచారణ మొదలవుతుందని,కఠిన శిక్ష వేసి దాన్ని అమలు చేస్తామని హెచ్చరించారు. మొక్కలు నాటిన తరువాత వాటిని ఫొటోలు తీసి..పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని డిప్యూటీ కన్సర్వేటర్‌ను కోర్టు కోరింది.

నాటిన మొక్కల్ని ఆరు నెలలపాటూ సంరక్షించాలనీ..ఆ తరువాత కూడా వాటిని ఫొటోలు తీసి మరో రిపోర్ట్ ఇవ్వాలని క్లారిటీగా ఆదేశించింది. ఒకవేళ మొక్కలు నాటకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు ఫైన్ చెల్లించాలని సూచించగా మొక్కలు నాటడం కంటే ఫైన్ చెల్లించడమే మేలని రూ.18,267 చెల్లించాడు. దీంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

- Advertisement -