జవాన్ పైరసీదారుల వివరాలు ఇవ్వండి:డిల్లీ హైకోర్టు

10
- Advertisement -

సినిమాలను పైరసీ చేయటం చట్టరీత్యా నేరం. పైరసీకి వ్యతిరేకంగా ‘జవాన్’ మేకర్స్ పెద్ద పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ సినిమాను నిర్మించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పైరసీదారులపై డిల్లీ హైకోర్టులో కేసు వేసింది. జవాన్ సినిమాకు సంబంధించి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో చట్టవిరుద్ధంగా షేర్ చేయబడిన కంటెంట్‌ను తొలిగించమని, డీయాక్టివేట్ చేయాలని కోర్టుని మేకర్స్ కోరారు.

ఈ నేపథ్యంలో కోర్టు.. ఎయిర్ టెల్, ఐడియా, ఒడాఫోన్, రిలయన్స్, జియో, బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థలకు వాట్సాప్, టెలిగ్రామ్‌ల్లో ఉంటూ జవాన్ సినిమాను పైరసీ కంటెంట్‌ను షేర్ చేశారో వారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్, వారు ఉపయోగించే అకౌంట్ వివరాలను తెలియజేయాలని కోరింది. అలాంటి వారందరిపై న్యాయపరమైన చర్యలను తీసుకోవటానికి నిర్మాణ సంస్థ సిద్ధమవుతోంది.

రెడ్ చిల్లీస్ తన దరఖాస్తులో కోరిన దాని ప్రకారం భారత్ సహా విదేశాల్లోని వ్యక్తులు నిర్వహిస్తున్న గ్రూప్‌లను మూసివేయాలని, తక్షణ చర్య తీసుకోవాలని వాట్సాప్ యాజమాన్యంలోని ప్రధానమైన ప్లాట్‌ఫారమ్‌లను కోర్టు ఆదేశించింది.

ఈ సందర్బంగా..రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సి.ఇ.ఒ ప్రదీప్ నీమాని మాట్లాడుతూ ‘‘సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యల్లో పైరసీ ప్రధానమైంది. దీనిపై పోరాటం చేయటానికి మేం పలు యాంటీ పైరసీ ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నాం. అందులో భాగంగా వాట్సాప్, టెలిగ్రామ్స్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో జవాన్ సినిమాకు సంబంధించి పైరసీ కాపీలను అన్వేషిస్తున్నాం. రోహిత్ శర్మ సహా పలువురు వ్యక్తులు ఈ సినిమాకు సంబంధించిన పైరసీ కాపీలను చట్టవిరుద్దంగా షేర్ చేసినట్లు గుర్తించాం. శాంతా క్రూజ్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. వీరందరిపై పోలీసులు కొన్ని రోజుల్లోనే చర్యలు తీసుకోబోతున్నారు. వీలైతే కోర్టు ఆర్డర్ ప్రకారం అరెస్ట్ కూడా చేయవచ్చు.

Also Read:వామ్మో..రక్తపోటుతో కిడ్నీ సమస్యలు!

రోహిత్ శర్మ సహా పలువురు వాట్సాప్ ద్వారా ‘జవాన్’ సినిమాకాపీలను అతి తక్కువ మొత్తానికి అక్రమంగా విక్రయిస్తున్నట్లు రెడ్ చిల్లీస్ గుర్తించిన కోర్టు బలమైన ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా సదరు వ్యక్తి వాట్సాప్ సహా టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ అకౌంట్‌ను రద్దు చేయాలని కోర్టు చెప్పింది. అలాగే ఇతరులు ఎవరైతే చట్టవిరుద్ధంగా సినిమాను విక్రయించే ప్రయత్నం చేశారో వారి వాట్సాప్ గ్రూప్‌లు మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లను గుర్తించి నిర్వాహకులపై కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ ఏడాది ప్రారంభంలో రెడ్ చిల్లీస్ దాఖలు చేసిన ‘జాన్ డో’ దావాలో కేసులో ఆమోదించిన ఆదేశాల ప్రకారం, ఢిల్లీ హైకోర్టు జవాన్ చిత్రం యొక్క పైరసీ కాపీలను కొన్ని వెబ్ సైట్స్‌లోని అప్లికేషన్‌లో హోస్ట్ చేస్తున్నట్లు గుర్తించి వాటిని తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది.ఈ కేసుని సీనియర్ న్యాయవాదులు రాజశేఖర్ రావు, నిజాం పాషాతో పాటు డీఎస్‌కె లీగల్ పార్టనర్లు చంద్రిమా మిత్ర, పరాగ్ ఖంధర్ రెడ్ చిల్లీస్ తరపున ఢిల్లీ హైకోర్టులో వాదించారు.

- Advertisement -