కాలుష్య నివారణ..ఆ వెహికల్స్‌కు నో ఫ్యూయల్‌!

3
- Advertisement -

కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. వ్యాలిడిటీ ముగిసిన వెహికల్స్‌కు ఇకపై నో ఫ్యూయల్‌ అని తెలిపింది. 10 ఏళ్లు దాటిన డీజిల్‌, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇకపై ఫ్యూయల్‌ పోయరు.

పెట్రోల్‌ బంకుల వద్దే పాత వెహికల్స్‌ గుర్తించనున్నారు. ఇందుకు సంబంధించి 520 పెట్రోల్‌, డీజిల్‌ బంకుల్లో నంబర్‌ ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.ఇందుకు సంబంధించి కార్యచరణ రూపొందించారు. 1 నుండి 100 వరకు నంబర్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ఢిల్లీ పోలీస్ మోహరించనుంది. 101 నుండి 159 వరకు నంబర్ ఉన్న బంకుల వద్ద ట్రాన్స్‌పోర్ట్ శాఖ ప్రత్యేకంగా 59 బృందాలను మోహరిస్తుంది.మొత్తం 350 పెట్రోల్ బంకుల వద్ద ఒకో ట్రాఫిక్ పోలీస్ అధికారిని నియమిస్తారు.

Also Read:పెరిగిన రైల్వే ఛార్జీలు

ప్రతి బంక్ వద్ద అదనంగా ఇద్దరు పోలీసులను శాంతి భద్రతల కోసం నియమిస్తారు. పెట్రోల్ బంకుల వద్ద ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ గుర్తింపు (ANPR) కెమెరాలను ఏర్పాటు చేశారు.ఇవి వాహనాల రిజిస్ట్రేషన్ డేటాబేస్ అయిన వాహన్ (VAHAN) తో అనుసంధానించబడి ఉంటాయి.పాత వాహనాలను గుర్తించి, ఆ సమాచారాన్ని ఇంధనం ఇస్తున్న బంక్ సిబ్బందికి అలెర్ట్ రూపంలో తెలియజేస్తాయి.ఈ సమాచారం అమలు బృందాలకు పంపించి, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్క్రాప్ చేయబడుతుంది.

- Advertisement -