Delhi AQI:140కి పైగా ఫ్లైట్లు రద్దు!

3
- Advertisement -

బుధవారం ఉదయం ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలను దట్టమైన మేఘపుప్ప కప్పి Visibility ను కేవలం కొన్ని మీటర్లుగా తగ్గించింది. ఫ్లైట్, ట్రైన్ సేవలలో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI Airport) CAT-III ప్రోటోకాల్స్ కింద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కారణంగా 140కి పైగా ఫ్లైట్లు రద్దు అయ్యాయని, వాటిలో 70 డిపార్చర్స్ ఉన్నాయని సమాచారం.

ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులకు అదనపు సమయం తీసుకోవాలని, ఫ్లైట్ స్టేటస్ ముందుగా చెక్ చేసుకోవాలని సూచించాయి. దట్టమైన పొగమంచు కారణంగా కొన్ని ట్రైన్లు ఆలస్యం అయ్యాయి. ప్రయాణికులు వారి ట్రైన్ల కోసం వేచి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఇండియా మెటీరియోలోజికల్ డిపార్ట్‌మెంట్ (IMD)..ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, ఉదయం 7 గంటలకు ఢిల్లీ AQI 384గా నమోదయింది, ఇది ‘వెరి పూర్ టు సీవియర్’ కేటగిరీలోకి వస్తుంది.

అనంద్ విహార్ 452, ITO 426, RK పురం 411, చాందని చౌక్ 419, దవర్‌కా సెక్టర్ 8 414 AQI తో ‘సీవియర్’ స్థాయిలో ఉన్నట్లు.దట్టమైన పొగమంచు కారణంగా వాణిజ్య, రోడ్ల మరియు రవాణా సేవల్లో అంతరాయం కొనసాగుతుంది.

Also read:న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్

- Advertisement -