- Advertisement -
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. 44వ రోజుకు చేరింది అన్నదాతల నిరసన.నేడు కేంద్రంతో రైతుసంఘాల ఎనిమిదో దఫా చర్చలు జరగనుండగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై చర్చ జరగనుంది.చట్టాల రద్దుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
చట్టాల రద్దు తప్ప ఏ ప్రతిపాదనైనా పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది.కొత్త చట్టాల్లో కీలక సంస్కరణలను ప్రతిపాదించింది కేంద్రం.సవరణలకు అంగీకరించేది లేదని రైతులు తేల్చి చెప్పగా ఇప్పటివరకు జరిగిన ఏడు విడతల చర్చల్లో ప్రతిష్టంభన తొలగలేదు.ఇవాళ్టి చర్చల్లో పురోగతి లభిస్తుందని భావిస్తోంది కేంద్రం.
- Advertisement -