మరో వజ్రాల వ్యాపారి భారీ కుంభకోణం..

218
- Advertisement -

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన మామ ఛోక్సీలు పంజాబ్‌నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.11,400కోట్ల భారీ మోసాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో మరో వజ్రాల కంపెనీ భారీ మోసం బయటపడింది. దిల్లీకి చెందిన ద్వారకా దాస్‌ సేథ్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే వజ్రాల ఎగుమతి కంపెనీ ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో రూ.389.85కోట్ల భారీ మోసానికి పాల్పడ్డట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అనంతరం సీబీఐ ఈ కంపెనీపై కేసు నమోదు చేసింది.

Delhi Diamond Exporter Booked for Rs389cr Scam

ఈ కంపెనీపై ఓరియంటల్ బ్యాంకు ఆరు నెలల క్రితమే సీబీఐకి ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన ఆనంతరం ఈ కంపెనీకి చెందిన డైరెక్టర్లు సభ్యసేథ్‌, రీటాసేథ్‌, కృష్ణకుమార్‌ సింగ్‌, రవి సింగ్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ద్వారకా దాస్‌ సేథ్‌ సెజ్‌ ఇన్‌కార్పొరేషన్‌ పేరుతో ఉన్న మరో కంపెనీ పైనా సీబీఐ కేసు పెట్టింది. ఈ కంపెనీ ఓరియంటల్‌ బ్యాంకు నుంచి 2007 నుంచి 2012 సంవత్సరాల మధ్య చాలాసార్లు రుణాలు పొందింది. ఈ కంపెనీ మొత్తం రూ.389కోట్లు బ్యాంకుకు బకాయి పడింది. ఈ కంపెనీ కూడా నీరవ్‌ మెదీ తరహాలో లెటర్స్‌‌ ఆఫ్‌ క్రెడిట్‌ ( ఎల్‌ఓయూ ) ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్టు సీబీఐ గుర్తించింది.

- Advertisement -