వాస్తవ సంఘటనల ఆధారంగా నడిచే కథనంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్. రెండు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకోగా తాజాగా మూడో సీజన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సీజన్‌లో కూడా షెఫాలీ షా మరోసారి డీసీపీ వర్థికా చతుర్వేదిగా తిరిగి వస్తున్నారు. రాజధానిలో జరిగే సున్నితమైన కేసులను గత సీజన్‌ల మాదిరిగానే నిశితంగా, వాస్తవానికి దగ్గరగా చూపించబోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ‘Delhi Crime Season 3’ నేడు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వస్తోంది. కొత్త ఎపిసోడ్‌ల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ అప్‌డేట్‌పై ఇప్పటికే ఆసక్తిగా స్పందిస్తున్నారు.
Also Read:త్వరలో టీటీడీ AI చాట్‌బాట్
ఈ సిరీస్‌ను రిచీ మెహతా సృష్టించగా, SK Global Entertainment, Golden Karavan, మరియు Film Karavan సంస్థలు నెట్‌ఫ్లిక్స్ కోసం నిర్మించాయి. షెఫాలీ షాతో పాటు రసికా దుగ్గల్, రాజేశ్ తైలాంగ్, ఆదిల్ హుస్సేన్, మరియు హుమా ఖురేషీ కూడా ఈ కొత్త సీజన్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాత ముఖాలతో పాటు కొత్త శక్తిని జోడిస్తూ, ఈ సీజన్ ప్రేక్షకులకు మరింత ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించబోతోంది.

