- Advertisement -
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా ఇవాళ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 12 లోగా బదులివ్వాలని గాంధీలతో సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాడెంజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడా, యంగ్ ఇండియా (వైఐ)లకకు నోటీసులు జారీ చేసింది న్యాయస్ధానం.
నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కాంగ్రెస్‌కు అందచేసిన రూ 90.25 కోట్ల రుణాల వసూళ్ల హక్కులను కేవలం రూ 50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ)కు కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ నేతలు మోసపూరితంగా వ్యవహరించారని సుబ్రమణ్యస్వామి కోర్టును ఆశ్రయించారు.
- Advertisement -