ఐపీఎల్ 2021..అన్ని మ్యాచ్‌లు అక్కడే!

59
ipl 2021

ఐపీఎల్ 2021 మినీ వేలం విజయవంతంగా ముగిసింది. 14వ సీజన్‌ కోసం ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. ఈ సారి ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతించాలనే దానిపై బీసీసీఐ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుండగా ఐపీఎల్‌ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై స్పష్టతకు వచ్చినట్లు సమాచారం.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనా, కరోనా కేసులు ఇంకా నమోదవుతుండటం, విదేశీ ప్రయాణాలు చేసే వారిపై ఆంక్షలు కొనసాగుతుండటం, క్రీడలకు ఇంకా అనుమతులు మంజూరు చేయకపోవడంతో ఐపీఎల్‌ను ఒకే నగరానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ముంబై, అహ్మదాబాద్‌లలో ఒక వేదికను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. గ్రూప్ దశలో నిర్వహించే మ్యాచ్‌లను ముంబైలోని నాలుగు స్టేడియాల్లో.. ప్లేఆఫ్స్, ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం కేటాయించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.