ఢిల్లీ దొరలు వర్సెస్ తెలంగాణ ప్రజలు!

37
- Advertisement -

దేశాన్ని అధోగతి పట్టించిన డిల్లీ దొరలు ఇప్పుడు తెలంగాణ పై దృష్టి పెట్టారు. అధికారం కోసం గోతికాడ నక్కలా చూస్తున్నారు. అసలు రాష్ట్రానికి ఏ నాడు రాని డిల్లీ పాలకులు.. ఇప్పుడు తరచూ తెలంగాణకు వస్తు కపట ప్రేమ కనబరుస్తున్నారు. ఏదో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ రాష్ట్రాన్ని దొచేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజానీకానికి డిల్లీ పాలకుల వంకర బొద్ది తెలియంది కాదు.. ఏళ్ల తరబడి దేశంలో కాంగ్రెస్ బీజేపీ పాలన చూస్తున్న ప్రజలు.. అంత తేలిగ్గా ఆ రెండు పార్టీల ముసుగులో పడే అవకాశం లేదు.

ఇతర రాష్ట్రాలను నిధులు పుష్కలంగా సమకూరుస్తూ తెలంగాణ విషయంలో మాత్రం పక్షపాతం చూపిస్తూ.. అసలు ఏనాడు తెలంగాణను రాష్ట్రంగా గుర్తించని ప్రధాని మోడీ.. తీరా ఎన్నికలు వచ్చేసరికి కపట ప్రేమ ఒలకబోస్తూ రాజకీయ లబ్ధి కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ వంటి వాటిని ఏళ్ల తరబడి హోల్డ్ లో పెడుతూ.. గుజరాత్ వంటి రాష్ట్రాలకు తెలంగాణ నిధులను మల్లిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ప్రధాని మోడీ.. అసలు తెలంగాణలో పర్యటించే అర్హత లేదని స్వయంగా ప్రజలే వ్యతిరేకించే పరిస్థితి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే కల్లబొల్లి హామీలు ప్రకటించి రాష్ట్రాన్ని సర్వం ధోచుకునే ప్రణాళికలు వేస్తున్నారు హస్తం నేతలు. ఆ పార్టీలో ఉన్న ప్రతి నేత కూడా ఏదో ఒక మనీ లాండరింగ్ స్కామ్ లో దోషిగా ఉన్నవారే.

Also Read:18న సంతోషం ఓటీటి అవార్డ్స్

మరి అలాంటి నేతలకు అధికారమిస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే అనే సంగతి తెలియంది కాదు. కర్నాటకలో ఇచ్చిన హామీలను గాలికి ఒదిలేసి ప్రజల భవిష్యత్తు ను మంటగలిపేలా దుర్మార్గ పాలన సాగిస్తోందంటూ కాంగ్రెస్ పై ఆ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మండి పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు రావడంతో అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళలా ప్రజల ముందుకు వస్తున్నాయి. ఆ పార్టీల కుయుక్తులు, కుతంత్రాలను తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టడం ఖాయమని విశ్లేషకులు, రాజకీయవాదులు చెబుతున్నారు. ఈ ఎన్నికలు డిల్లీ దొరలకు మరియు తెలంగాణ ప్రజలకు మద్య జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో ఢిల్లీ దొరలను తిరిగి ఢిల్లీ పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు.

Also Read:పెద్దపల్లిలో లక్ష మెజార్టీతో గెలవాలి:సీఎం కేసీఆర్

- Advertisement -