Delhi:ఖాతా తెరవని కాంగ్రెస్!

5
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చివచూసింది. కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. 2013 వరకు వరుసగా మూడు సార్లు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. ఆ తర్వాత నుండి ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలవడం లేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ జీరోకే పరిమితమైంది.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ ఓడించి, ఢిల్లీ రాజకీయ పటంలో ఆప్ తన ఆధిపత్యాన్ని స్థాపించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 67 స్థానాలను గెలుచుకుంది. 2020లో ఆ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 62 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లను చిత్తు చేసింది. ఆప్ విజయంతో ఢిల్లీలో కేజ్రీవాల్ ఆధిపత్యాన్ని, జాతీయ స్థాయిలో ఆయన రాజకీయ ప్రతిష్టను పెంచింది.

అయితే తాజాగా 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 47 స్థానాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా ఆప్ 23 స్థానాలకు పరిమితమైంది.

Also Read:కేజ్రీవాల్ వల్లే ఓటమి: అన్నా హజారే

- Advertisement -