- Advertisement -
మే 1 నుండి 18 సంవత్సరాలు పై బడిన వారందరికి వ్యాక్సినేషన్ అందించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీకాల కోసం బారులు తీరొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. టీకాలు వచ్చిన వెంటనే తెలియజేస్తామని, అప్పుడే రావాలని సూచించారు.
ఢిల్లీకి అవసరమైన టీకాలు రాలేదని, కంపెనీలతో నిరంతరం సంప్రదిస్తున్నామని తెలిపారు. కొవిషీల్డ్ మూడు లక్షల మొదటి డోసులు, వ్యాక్సిన్లు శనివారం లేదా ఆదివారం వస్తాయని ఆశిస్తున్నామని.. ఈ మేరకు కంపెనీ సైతం హామీ ఇచ్చిందని చెప్పారు.
వచ్చే మూడు నెలల్లో రెండు కంపెనీల నుంచి 67లక్షల మోతాదుల చొప్పున అందుబాటులో ఉంచాలని సీరం, భారత్ బయోటెక్ సంస్థలను కోరినట్లు చెప్పారు.
- Advertisement -