ఐపీఎల్ సీజన్లో నేడు ఆసక్తికరపోరు జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఇక, కరోనా బారిన పడ్డ మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక, గత మ్యాచులో దూరమైన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తిరిగి జట్టులో చేరాడు. అలాగే, ఓడియన్ స్మిత్ స్థానంలో నాథన్ ఎల్లీస్ ని తుది జట్టులోకి తీసుకుంది.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), మహ్మద్ షారుఖ్ ఖాన్, కగిసొ రబడ, నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ (కేప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రౌమన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్