రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు..

231
Delhi Capitals
- Advertisement -

రాజస్థాన్ రాయల్స్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఢిల్లీ అలవోక చేధించి విజయం సాధించింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పేరు మార్చుకొని బరిలో దిగి తొలిసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసింది. అజింక్యా రహానే (105 నాటౌట్) అజేయ సెంచరీకి స్మిత్ (32 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ శతకం తోడవడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శిఖర్ ధవన్ (54), పృథ్వీ షా (42)తో పాటు రిషబ్ పంత్ (78 నాటౌట్) చెలరేగడంతో ఢిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది.

స్కోరుబోర్డు..

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: రహానె నాటౌట్‌ 105; శాంసన్‌ రనౌట్‌ 0; స్టీవ్‌ స్మిత్‌ (సి) మోరిస్‌ (బి) అక్షర్‌ 50; స్టోక్స్‌ (సి) అయ్యర్‌ (బి) మోరిస్‌ 8; టర్నర్‌ (సి) రూథర్‌ఫర్డ్‌ (బి) ఇషాంత్‌ 0; బిన్నీ (బి) రబాడ 19; పరాగ్‌ (బి) రబాడ 4; ఎక్స్‌ట్రాలు 5;
మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191;
వికెట్ల పతనం: 1-5, 2-135, 3-157, 4-163, 5-187, 6-191;
బౌలింగ్‌: ఇషాంత్‌ 4-0-29-1; రబాడ 4-0-37-2; అక్షర్‌పటేల్‌ 4-0-39-1; మిశ్రా 3-0-28-0; మోరిస్‌ 4-0-41-1; రూథర్‌ఫర్డ్‌ 1-0-16-0

దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) పరాగ్‌ (బి) గోపాల్‌ 42; ధావన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) గోపాల్‌ 54; శ్రేయస్‌ (సి) స్టోక్స్‌ (బి) పరాగ్‌ 4; పంత్‌ నాటౌట్‌ 78; రూథర్‌ఫర్డ్‌ (సి) పరాగ్‌ (బి) ధవళ్‌ 11; ఇంగ్రామ్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 1
మొత్తం: (19.2 ఓవర్లలో 4 వికెట్లకు) 193;
వికెట్ల పతనం: 1-72, 2-77, 3-161, 4-175;
బౌలింగ్‌: బిన్నీ 1-0-3-0; ధవళ్‌ కులకర్ణి 4-0-51-1; ఉనద్కత్‌ 3.2-0-36-0; శ్రేయస్‌ గోపాల్‌ 4-0-47-2; ఆర్చర్‌ 4-0-31-0; రియాన్‌ పరాగ్‌ 3-0-25-1

- Advertisement -