ఢిల్లీలో పేలుళ్లు..షాకింగ్ నిజాలు!

5
- Advertisement -

నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్‌కు సంబంధించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 10 ఢిల్లీ కార్ పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న ఇంటెలిజెన్స్ సంస్థలు, ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అని గుర్తించాయి. నిందితులు హర్యానా ఫరీదాబాద్‌లో దాచిన పేలుడు పదార్థాలను ఉపయోగించి జమ్మూ–కాశ్మీర్‌లో భారీ దాడి చేయాలని ప్రయత్నించినట్టు బయటపడింది.

నెయిల్ పాలిష్ రిమూవర్ + చక్కెరతో పేలుడు పదార్థాలు తయారు చేసినట్లు గుర్తించారు అధికారులు. డాక్టర్ ఉమర్, ఎర్రకోట సమీపంలో పేలిపోయిన హ్యుందాయ్ i20 కార్ నడిపిన వ్యక్తి. ఎర్రకోట పేలుడు + ఫరీదాబాద్‌లో లభించిన భారీ పేలుడు పదార్థాల రెండింటికీ మాస్టర్‌మైండ్‌గా గుర్తించారు. ఈ ఘటనలో 15 మంది మరణించారు.

ఉమర్ తరచుగా తన చర్యలు మతం కోసం చేస్తున్నానని చెప్పేవాడు. దేశంలో వైషమ్యం పెరుగుతోందని, జనసంహారం జరిగే ప్రమాదం ఉందని నమ్మేవాడు. 2023లో జరిగిన మేవాట్–నుహ్ హింస, నాసిర్–జునైద్ హత్య కేసు ఘటనలు అతన్ని తీవ్ర మౌలికవాద భావజాలానికి నెట్టినట్టు విచారణలో తేలింది. ఉమర్ తనను ‘అమీర్’ (అంటే నాయకుడు/అధికారి) అని పిలుచుకునేవాడు.

హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, పర్షియన్, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్ తో పాటు 9 భాషలు ఉమర్‌కి తెలుసు. ఉమర్ తరచూ దేశంలో పరిస్థితులు దిగజారుతున్నాయి..ధృవీకరణ (పోలరైజేషన్) పెరుగుతోంది..జనసంహారం సంభవించవచ్చు అని చెప్పేవాడు అని విచారణలో తేలింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ–కాశ్మీర్ భద్రతా దళాలపై అతనిలో తీవ్రమైన విద్వేషం పెరిగిందని ముజమ్మిల్ తెలిపాడు.అందుకే, ఫరీదాబాద్‌లో దాచిన పేలుడు పదార్థాలను తీసుకుని జమ్మూ–కాశ్మీర్ వెళ్లి భారీ దాడి చేయాలనే పథకం రూపొందించారు.

చైనీస్‌లో గ్రూప్ చాట్, రహస్య సంభాషణలు జరిపారు. గ్రూప్ కోర్ సభ్యులు… ముజమ్మిల్,ఉమర్,ఆదిల్,షాహీన్,ముఫ్తీ ఇర్ఫాన్,ఉమర్… ఆరుగురు సభ్యులకు చైనీస్‌లో ఒక చాట్ గ్రూప్ సృష్టించాడు.సంభాషణలు, ఫైళ్ళు, గ్రూప్ పేరు కూడా అన్నీ చైనీస్‌లోనే ఉండేవి.చైనీస్ భాషను ఉమర్ కేవలం ఆరు నెలల్లోనే నేర్చుకున్నాడు.

Also Read:వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పులు..ఆఫ్ఘాన్ వ్యక్తి!

ఉమర్ + మరో వ్యక్తి టర్కీకి వెళ్లి ఓకాసా అనే కోడ్‌నేమ్‌తో ఉన్న హ్యాండ్లర్స్‌ను కలిశారు.భవిష్యత్తులో ఆఫ్ఘానిస్తాన్ లేదా సిరియాకు వెళ్లాలని ప్లాన్ చేశారు.అల్–ఫలాహ్ యూనివర్సిటీలో పేలుడు పదార్థాల పరీక్షలు నిర్వహించారు. 2023లో ఉమర్, ఆదిల్ నుహ్–మేవాట్ ప్రాంతం నుంచి ఎరువులు కొనుగోలు చేశారు.అవి అల్–ఫలాహ్ యూనివర్సిటీలోని వారి గదుల్లో నిల్వ చేశారు. డాక్టర్లు కావడంతో వారి వాహనాలను ఎవరూ తనిఖీ చేయలేదు.

ఉమర్ తన గదిలోనే TATP (ప్రమాదకర పేలుడు పదార్థం) తయారీ పరీక్షలు కూడా చేశాడు.అతని సూట్‌కేస్‌లో విస్తృతంగా బాంబు తయారీ ఆధారాలు లభించాయి.
2025 నాటికి పేలుడు పదార్థాలు పూర్తిగా సిద్ధం అయ్యాయి. అవి జమ్మూ–కాశ్మీర్ తీసుకెళ్లి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవాలనుకున్నామని విచారణలో వెల్లడించారు.

అక్టోబర్ 15: జమ్మూ–కాశ్మీర్ పోలీసులు ఇద్దరు పోస్టర్ మేకర్లను, ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమానిని అరెస్ట్ చేసి విచారించారు. ముఫ్తీ ఇర్ఫాన్ ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు.అక్టోబర్ 18: ముఫ్తీ ఇర్ఫాన్ అరెస్ట్. అతని ఫోన్‌లో గ్రూప్ వివరాలు లభించడంతో ముజమ్మిల్‌ను ఫరీదాబాద్‌లో అరెస్ట్ చేశారు.ఉమర్ ఫ్లాట్ నుండి పేలుడు పదార్థాల ఉష్ణోగ్రత నియంత్రించడానికి వాడిన డీప్ ఫ్రీజర్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాంబు తయారీ సామగ్రితో నిండిన సూట్‌కేస్ కనిపించాయి.

Also Read:వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పులు..ఆఫ్ఘాన్ వ్యక్తి!

- Advertisement -