- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనుంది ఈసీ. నూతన సంవత్సరం వెలువడుతున్న తొలి ఎన్నికల నోటిఫికేషన్ కావడంతో అందరి దృష్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది.
ఫిబ్రవరి రెండో వారంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గడువు ముగియనుంది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీలోని ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించి.. అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టారు.
ఇప్పటికే ఆప్ 70 స్థానాలకు నాలుగు దశల్లో అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. అటు, బీజేపీ సైతం తొలి జాబితాను ప్రకటించింది. ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ జరిగే అవకాశం ఉంది.
Also Read:యష్ బర్త్ డే..టాక్సిక్ గ్లింప్స్!
- Advertisement -