ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని 8న ఫలితాలు విడుదలవుతాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఒకే విడతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల విత్ డ్రా కు చివరి తేదీ జనవరి 20.
గతేదాడి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది జరుగుతున్న తొలి ఎన్నికలు అన్నారు. ఓటర్ లిస్ట్ ట్యాప్ అయిందన్న ఆరోపణలను తోసిపుచ్చారు రాజీవ్ కుమార్. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందన్నారు.ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సారి కొత్త ఓటర్లు 2 లక్షల మంది ఓటు హక్కు వినియోంచుకోబోతున్నారని తెలిపారు.
Also Read:కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..కర్రలతో కొట్టుకున్న కార్యకర్తలు

