- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఆరు గంటల లోపు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.
ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు మరియు 1,267 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
న్యూఢిల్లీ నుండి ఆప్ నేత , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాల్కాజీ నియోజకవర్గం నుండి సీఎం అతిషి, జంగ్‌పురా నియోజకవర్గం నుండి మానీష్ సిసోడియా, షకూర్ బస్తీ నియోజకవర్గం నుండి సత్యేంద్ర జైన్ బరిలో నిలిచారు. 2020, 2015 ఎన్నికలల్లో ఆప్ విజయం సాధించగా 1998 లో చివరిసారిగా BJP సీఎం అధికారంలో ఉన్నారు.
* మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు : 70
జనరల్ సీట్లు :58, ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లు: 12
ఢిల్లీలో ఓటర్లు మొత్తం : 1.55 కోట్లు
* పురుషులు : 83.49 లక్షలు
* మహిళలు: 71.74 లక్షలు
* యువ ఓటర్లు ( 20–29 సంవత్సరాల మధ్య) : 25.89 లక్షలు
* తొలిసారి ఓటర్లు (18–19 సంవత్సరాల) : 2.08 లక్షలు
* పీడబ్ల్యూడీ ఓటర్లు : 79,436
* వందేళ్లు దాటిన ఓటర్లు : 830
* 85+ వయసు దాటిన ఓటర్లు : 1.09 లక్షలు
* ట్రాన్స్‌జెండర్ ఓటర్లు : 1,261
ఢిల్లీలో పోలింగ్ స్టేషన్లు : 13,033
* ప్రాంతాలు :2,697
* ఢిల్లీలో 100% పట్టణ ప్రాంత పోలింగ్ స్టేషన్లు
* ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు సగటు ఓటర్లు : 1191
* వెబ్ కాస్టింగ్ :100%
* పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహించే పోలింగ్ స్టేషన్లు : 70
* మహిళా సిబ్బంది నిర్వహించే పోలింగ్ స్టేషన్లు :70
* మోడల్ పోలింగ్ స్టేషన్లు : 210
Also Read:సమగ్ర కుటుంబ సర్వే వివరాలు డిలీట్..
- Advertisement -