- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. మొత్తం 70అసెంబ్లీ స్ధానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. 70 స్ధానాలకు గాను 672మంది పోటీ చేశారు. అయితే ఢిల్లీ ఓటర్లు ఓటింగ్ వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించక పోవడం విశేషంగా చెప్పుకోవచ్చు..
చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు అందరూ ముందుకు రావాని పిలుపునిచ్చారు. సాయంత్రం 5.30గంటల వరకు 53శాతం పోలింగ్ నమోదైంది. కాగా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసు అవకాశం కల్పించనున్నారు అధికారులు. ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.
- Advertisement -