కూలిన ఢిల్లీ ఎయిర్ పోర్టు పైకప్పు

10
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) టెర్మినల్-1లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు పైకప్పు భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.

ఈ ఘటనను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని…కమిటీ రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఈ ప్రాంతమంతా రోడ్లు జలమయమయ్యాయి. ఘటనాస్థలికి మూడు ఫైరింజన్లను తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:TTD:సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు

- Advertisement -