వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఎలాగైనా గద్దె దించాలని, బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని విపక్షాలు గట్టి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వస్తే విపక్షాలపై మోడీ మరింత కక్ష పూరితంగా వ్యవహరించే ప్రమాదం ఉందని అలా జరగకుండా ఉండాలంటే అందరూ ఏకతాటిపైకి వచ్చి సమిష్టిగా బీజేపీని ఎదుర్కోవలని ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి విపక్షాలు. ఇప్పటివరకు ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉండగా వీటి సంఖ్య ఎన్నికల నాటికి మరింత ఏప్రిగిన ఆశ్చర్యం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరువాత ప్రత్యామ్నాయ పార్టీలుగా అవతరించాలని చూసిన ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ వంటి పార్టీలు సైతం కూటమిలో చేరిపోయాయి. .
దీంతో ఎన్డీయే వర్సస్ ఇండియా కూటముల మద్య ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటికి ఆ పార్టీలో సీట్ల పంపకాలు, పిఎం అభ్యర్థి వంటి అంశాలపై కూటమిలో లొల్లి ఏర్పడడం ఖాయమని, బీజేపీ పెద్దలు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం కూటమిలో పరిస్థితులు చూస్తుంటే ఆ మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజా సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ మరియు అప్ మద్య అగ్గి రాజుకున్నట్లు తెలుస్తోంది. డిల్లీ లోని ఏడు ళొక్ సభ స్థానాలలో తామే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించడం హస్తం పార్టీకి మింగుడు పడడం లేదట.
ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్ తో ఏ మాత్రం సంప్రదించకుండా సీట్లను ఎలా ప్రకటిస్తుందని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారట. ఇదే విధంగా జేడీయూ తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా సీట్ల పంపకల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ పరిణామాలు కాంగ్రెస్ ను గట్టిగా దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీదే ఆదిపత్యం అనేది అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికి కాంగ్రెస్ తో సంబంధం లేదన్నట్లుగా ఆయా పార్టీలూ వ్యవహరిస్తుండంతో విపక్షాల ఐక్యత పెన్నం మీద నీరులా అవిరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరి అభిప్రాయం.
Also Read:బీజేపీ తొలి జాబితా విడుదల!