‘డిగ్రీ కాలేజ్’ మూవీ నిర్మాత, దర్శకుడు అరెస్ట్

427
Narsimha Nandi
- Advertisement -

డిగ్రీ కాలేజ్ సినీ నర్సింహనంది, నిర్మాత శ్రీనివాసరావును టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిగ్రీ కాలేజ్ సినిమా ఈనెల 7న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా అశ్లీల ఫోటోలను రోడ్లపై అతికించారు. అంతేకాకుండా బస్ స్టాండ్ లలో ఈ అశ్లీల ఫోటోలను అతికించడంతో పలువురు ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీర్‌పేట చౌరస్తా సమీపంలో అసహ్యంగా ఉన్న ఈ పోస్టర్లను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదుతో దర్శక, నిర్మాతలు నర్సింహనంది, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు.

శ్రీలక్ష్మీనరసింహ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈసినిమాలో వరుణ్, శ్రీదివ్య, దువ్వాసి మోహన్, జయవాణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఇటీవలే ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. దీని ట్రైలర్ అశ్లీలంగా ఉందని విమర్శలు వచ్చాయి. నరసింహ నంది ఇదివరకు ‘హైస్కూల్‌’, ’కమలతో నా ప్రయాణం’ , ‘లజ్జ’ సినిమాలు తీశారు. ‘1940లో ఒక గ్రామం’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును కూడా అందుకున్నారు.

- Advertisement -