మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేసిన పరువు నష్టం కేసులో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని..కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కొండా సురేఖ తన సామాజిక మాధ్యమాల్లో నుండి వెంటనే తొలగించాలని పేర్కొంది కోర్టు. అన్ని రకాల ప్లాట్‌ఫారమ్‌ల నుండి అన్ని మీడియా సంస్థలు తొలగించాలని ఆదేశించింది కోర్టు.
సురేఖ వ్యాఖ్యలు సమంజసం కాదని, ఆమె చేసిన కామెంట్స్ పబ్లిక్ డొమైన్‌లో ఉండకూడదని ఆదేశించింది. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై పరువు నష్టం కేసులో కోర్టు ఇంత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇదే తొలిసారని బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు.
మంత్రి తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందుకు రూ.100 కోట్ల క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు కేటీఆర్.
Also Read:అధికారంలోకి వచ్చినా పనులు కావట్లేదు:టీడీపీ ఎమ్మెల్యే