బాజీరావ్ మస్తానీని తలపించిన దీప్‌వీర్‌..

254
Ranveer
- Advertisement -

బాలీవుడ్ ప్రేమపక్షులు దీపిక పదుకొణె-రణ్‌వీర్ సింగ్‌ల రిసెప్షన్‌ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దీప్‌వీర్‌ నవ దంపతులు మెరిశారు. బాజిరావ్ మస్తానీ సినిమాను తలపించేలా దుస్తులు,అలంకరణతో మెప్పించారు.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అబుజానీ సందీప్‌ ఖోస్లా డిజైన్‌ చేసిన చికంకారీ చీరను దీపికా ధరించగా రణ్‌వీర్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ డిజైన్‌ చేసిన షేర్వాణీని ధరించారు. ఒకే రకమైన కలర్‌ కాంబినేషన్‌లో దీప్‌వీర్‌ జంట చూడముచ్చటగా కనువిందు చేసింది. దీపిక,రణ్‌వీర్ కుటంబసభ్యులు,కొంతమంది మీడియా సభ్యులు హాజరయ్యారు.

deepika ranveer

డిసెంబర్‌ 1న మరో వివాహ విందును ఇవ్వనున్నారు దీప్‌వీర్ దంపతులు. ఈ విందులో బాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు పాల్గొననున్నారు. ఈ నెల 14,15 న ఇటలీలోని లేక్ కోమోలో జ‌రిగిన వివాహ వేడుక‌ల్లో ఒక్క‌టైన సంగతి తెలిసిందే.

Ranveer-Deepika Ranveer-Deepika

- Advertisement -