లాల్ బగుచా రాజా సన్నిధిలో దీప్‌వీర్

276
deepveer
- Advertisement -

బాలీవుడ్ నవ దంపతులు రణ్ వీర్ – దీపికా ముంబైలో సందడి చేశారు. సకుటుంబ సమేతంగా ప్రసిద్ధ లాల్ బగుచా రాజా(వినాయకుడి)ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దీప్ వీర్ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు పూజారులు.

ముంబయిలోని ప్రభావతి ప్రాంతంలో ఉన్న లాల్‌బౌగ్చా గణేష్‌ ఆలయం చాలా ఫేమస్‌. ఎందరో సెలబ్రిటీలు ఈ ఆలయన్ని తరచూ దర్శించుకుంటుంటారు.అంతేగాదు వినాయక చవితి వేడుకలను ఈ ఆలయంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు.

‘దీప్‌వీర్‌’ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డిసెంబర్‌ 1న  వివాహ విందును ఇవ్వనున్నారు దీప్‌వీర్ దంపతులు. ఈ విందులో బాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు పాల్గొననున్నారు. ఈ నెల 14,15 న ఇటలీలోని లేక్ కోమోలో జ‌రిగిన వివాహ వేడుక‌ల్లో ఒక్క‌టైన సంగతి తెలిసిందే.

- Advertisement -