సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘పద్మావతి’. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.పద్మావతి ట్రయిలర్ రిలీజ్ నాటి నుంచి హీరోయిన్ దీపికా పదుకునేకు వస్తున్న ప్రశంసలు మామూలుగా లేవు. ఇందులో రాణి పద్మావతిగా దీపిక అప్పియరెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. ఘూమర్ పాట రిలీజ్ తర్వాత ఆమె డ్యాన్స్ చూసినవారంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇంత క్రేజ్ తెచ్చుకున్న దీపిక ను ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా తిట్టిపోస్తున్నారు. పద్మావతి ట్రయిలర్ సూపర్ టాక్ తెచ్చుకున్న ఆనందంలో దీపిక తాజాగా ఫ్రెండ్సందరితో పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి షారూక్ ఖాన్, రణ్ వీర్ సింగ్, కరణ్ జొహార్, ఆలియా భట్, సోనాక్షి సిన్హా ,లాంటి వాళ్లతో పాటు స్టార్ కిడ్స్ బోలెడంత మంది వచ్చారు. వీళ్లతోపాటు హీరో రణబీర్ కపూర్ కజిన్స్ అర్మాన్ – ఆదార్ జైన్ లు కూడా వచ్చారు. అందులో ఆదార్ దీపికాకు ముద్దు పెడుతున్న సమయంలో తీసిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో దీపికా కళ్ళు మత్తుతో వాలిపోతున్నాయి.., మరీ ఎక్కువ తాగేసినట్టు వాలకం తెలిసిపోతోంది.
ఇక ఆ ఫొటో చూసిన అభిమానులు విమర్శలు ఎక్కుపెట్టడం ప్రారంభించారు.మత్తుగా సగం తెరిచి ఉన్న దీపికా కళ్ళని చూసి “దీపికా మొహం చూడండీ అని ఒకరంటే…., తాగుబోతు సెల్ఫీ అంటూ ఇంకొకళ్ళు, ఇలా సెటైర్ల వర్షం కురిపించేస్తున్నారు…ఈ పార్టీకి బాలీవుడ్ నెక్ట్స్ జనరేషన్ అంతా వచ్చింది. శ్రీదేవి కూతురు జాహ్నవి, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఫ్యాషన్ డిజైనర మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా, అభిషేక్ బచ్చన్ ఈ పార్టీకి హాజరయ్యారు .