‘అజ్ఞాతవాసి’ బైటికొచ్చి చూస్తే..!

186
Trivikram Srinivas Birthday Special
- Advertisement -

పవన్- త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో ‘అజ్ఞాతవాసి’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 25 వ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. జల్సా అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న చిత్రంపై ప్రేక్షకులతోపాటు పవన్ అభిమానులకు భారీ అంచనాలున్నాయి.

Trivikram Srinivas Birthday Special

అయితే ఈ రోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్బంగా తొలి పాటను సోషల్ మీడియాలో చిత్ర టీమ్ నేడు విడుదల చేసింది. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పాట లిరికల్‌ వీడియోను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు పేర్కొన్నారు. ‘బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్’ అంటూ సాగుతున్న పాట లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ప్రస్తుతం ‘ఆజ్ఞాతవాసి’ అన్న టైటిల్ ను చిత్రం కోసం పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

https://youtu.be/JXIiQFSj8Yg

- Advertisement -