పచ్చబొట్టు చెరిగిపోయింది…

345
deeps_tattoo
- Advertisement -

బాలీవుడ్ ప్రేమ‌ప‌క్షులు దీపికా ప‌దుకొనే, ర‌ణ్ వీర్ సింగ్‌ ల వివాహం నవంబర్‌ 20న పక్కా అంటూ వార్తలొచ్చాయి. ఇటలీలోని కోమో సరస్సు వీరి వివాహ వేడుకకు వేదికగా నిలవనుందని, . దీపికా, రణ్‌ వీర్‌ వివాహ వేడుకకు 30 మంది ఎంపిక చేసిన అతిధులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లనున్నాయని, దీపికా, రణ్‌వీర్‌లు ఈ ఏడాది నూతన సంవత్సరం రోజు మాల్దీవుల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో మునిగితేలారని, దీపికా బర్త్‌డే రోజు వీరిరువురి నిశ్చితార్ధం జరిగిందని బాలీవుడ్‌లో పుకార్లు షికారు చేశాయి.

deeps_tattoo

అయితే ఇందులో నిజం ఎంత ఉందో కానీ ఇప్పుడు దీపికా పదుకొనే త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందనే వార్త మాత్రం నిజమనే తెలుస్తోంది. ఇటీవలే దీపికా తల్లి ఉజ్జల పడుకోన్‌ బెంగుళూర్‌లోని నివాసంలో దీపికతో ఓ పూజ చేయించారు. దీనికి రణవీర్‌సింగ్‌ కూడా హాజరయ్యారు. పూజ అనంతరం పండితులు చెప్పినట్లుగా గ్లాస్‌ బ్యాంగిల్స్‌ దీపిక ధరించారు. దీప్‌వీర్‌ల పెళ్లికి ఇదే నాంది అని సన్నిహితులు చెబుతున్నారు. అయితే దీపికా పదుకొనే తనకు కాబోయే భర్త ప్రేమలో పడిన తర్వాత ఆమె తన పాత జ్ఞాపకాలను మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్ధమవుతోంది. ఎందుకంటే ఆమె గతంలో కొంత కాలం రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించింది. అంతే కాదు అతని పేరును తన భుజంపై పచ్చబొట్టులాగా వేయించుకుంది.

deeps_tattoo

అయితే రణవీర్‌సింగ్‌ తో ప్రేమలో పడిన తర్వాత ఆమెలో మార్పు తీసుకొచ్చాయి. పాత జ్ఞాపకాల్ని మరచిపోయేలా చేశాయి. ఆమె భుజంపై ఉన్న మాజీ ప్రియుడి పేరు కూడా ఆఖరుకు దీపికా పదుకొనె చెరిపేసుకుంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యేకంగా ముస్తాబై కనిపించింది దీపిక. ఆమె భుజంపై రణబీర్‌ పేరుతో టాటూ లేకపోవడం బాలీవుడ్‌ మీడియా గమనించింది. దీంతో రణబీర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న ఆ టాటూను చెరిపేసుకుందంటూ కథనాలు ప్రచురించింది. మొత్తానికి దీపికా పదుకొనె తన పాత జ్ఞాపకాల్ని మరిచిపోయి త్వరలోనే రణవీర్‌ సింగ్‌తో మూడుముళ్లు వేయించుకుని జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని మనమూ కోరుకుందాం.

- Advertisement -