త్వరలో దీపిక-రణ్‌వీర్‌ పెళ్లి..?

236
Deepika Padukone Ranveer Singh Marriage Date Confirmed?
- Advertisement -

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్ ప్రేమలో మునిగితేలుతున్నారని గత కొంత కాలంగా వార్తలు చకర్లు కొడుతున్నాయి. అంతేకాదు త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో ఇప్పటికే విరాట్-అనుష్కల పెళ్లి పూర్తయిపోగా..ఇప్పుడు మరో ప్రేమ జంట రణ్‌వీర్‌ సింగ్- దీపికా పదుకొనేలు కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Deepika Padukone Ranveer Singh Marriage Date Confirmed?

అయితే రెండు నెలల క్రితమే.. అంటే సరిగ్గా పద్మావత్ మూవీ రిలీజ్ కు ఓ వారం రోజుల ముందు ఓ పూజా కార్యక్రమం నిర్వహించారు రణ్‌వీర్‌ దీపిక. ఈ కార్యక్రమానికి అటు రణ్‌వీర్‌ పేరెంట్స్.. ఇటు దీపిక తల్లిదండ్రులు కూడా అటెండ్ అయారు. రీసెంట్ గా వీరంతా మరోసారి భేటీ అయ్యి వివాహం గురించి చర్చించుకున్నారట. సెప్టెంబర్ డిసెంబర్ మధ్యలో 4 ముహూర్తాలను ప్రపోజ్ చేశారని.. వీరి ప్రొఫెషనల్ షెడ్యూల్స్ ను అనుసరించి.. వీటిలో ఒకదాన్ని ఖాయం చేసుకోనున్నారని తెలుస్తోంది.

Deepika Padukone Ranveer Singh Marriage Date Confirmed?

ఇప్పటికే దీపికకు పెళ్లి డ్రెస్సుల డిజైనింగ్ తో పాటు.. ఆర్నమెంట్స్ ఆర్డర్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గా.. కేవలం బంధువుల మధ్యే ఈ పెళ్లి జరిగే అవకాశం ఉండగా.. పెళ్లి తర్వాత ఓ రిసెప్షన్ ను ఏర్పాటు చేసి.. బాలీవుడ్ ను ఆహ్వానించబోతున్నారట. ఈ ఏడాది ముగిసేసరికి రణ్‌వీర్‌ సింగ్- దీపికా పదుకొనేలు ఒకటి కావడం ఖాయం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

- Advertisement -