ఎన్టీఆర్‌పై మాధవిలత సంచలన వ్యాఖ్యలు..

238
Acrtress Madhavi Latha Shocking Comments On Jr.NTR
- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగువారికి అవకాశాలు ఇవ్వడం లేదంటూ..క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇటీవల గళమెత్తిన నటి మాధవీలత మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి రాజకీయాల గురించి మాట్లాడిన ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. జనాలకు మంచి చేయాలనే ఆలోచన ఎన్టీఆర్ కి తాతగారి నుంచి వచ్చి ఉండవచ్చని చెప్పింది. అతను తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తెలిపింది.

Acrtress Madhavi Latha Shocking Comments On Jr.NTR

అయితే వ్యక్తిగతంగా ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని… మంచి మాటకారి అని చెప్పింది. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని భావించానని… కానీ, ఆయనను ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. తన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమేనని… దీనిని రాజకీయం చేయవద్దని కోరింది. తన వ్యాఖ్యలతో ఏ రాజకీయపార్టీకి సంబంధం లేదని చెప్పింది. కేవలం తన మనసులోని భావాలను మాత్రమే బయటపెట్టానని తెలిపింది. ఈ అమ్మడు తన ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

- Advertisement -