మాఫియా క్వీన్‌గా మారనున్న దీపిక..!

192
Deepika Padukone on Sapna Didi Biopic
- Advertisement -

‘పద్మావత్’ సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించింది దీపిక పదుకోనే. రాణీ పద్మావతి పాత్రకు దీపిక తప్ప ఇంకెవ్వరూ చేయలేరన్న అభిప్రాయాలు ముక్త కంఠంతో వినిపించాయి. అందంతో.. అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన దీపిక తన స్టేచర్ ఎంతో పెంచుకుంది. ఆమెను మించిన హీరోయిన్ ఇప్పుడు ఇండియాలో లేరంటే అతిశయోక్తి కాదు. ‘పద్మావత్’తో ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయిన దీపిక.. మరో సెన్సేషనల్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అవుతోంది.

Deepika Padukone on Sapna Didi Biopic

మాఫియా క్వీన్ సప్నా దీదీగా దీపిక నటించబోతుండటం విశేషం. విలక్షణ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబయి’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సన్నా దీదీ కథలో ఎన్నో ఆసక్తికర మలుపుంటాయట. విలక్షణ చిత్రాలతో తనదైన ముద్ర వేసే విశాల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో దీపిక నటించబోతోందనగానే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చేసింది.

ఈ కథ వినగానే తనకు ఎగిరి గంతేయాలని అనిపించిందని దీపిక చెప్పడం విశేషం. ఈ పాత్ర.. ఈ సినిమా దీపిక కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతాయని భావిస్తున్నారు. ఈ మూవీలో ఇర్ఫాన్ ఖాన్ విలన్‌గా కనిపించనున్నాడట.

- Advertisement -