- Advertisement -
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే ఆసుపత్రిలో చేరారు. అమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. షూటింగ్లో ఉండగా ఒక్కసారిగా ఆమె హార్ట్‌రేట్ పెరగడంతో హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తరలించారు
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం దీపిక తాను బస చేసిన నోవాటెల్ హోటల్‌కు వెళ్లిపోయారు. నోవాటెల్లోనూ ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దీపిక ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఆమెకు వైద్యులు సూచించినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రభాస్ సరసన దీపికా పదుకొణే నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.
- Advertisement -