Deepika:దీపికా గ్లామర్ సీక్రెట్ ఇదే

33
- Advertisement -

దీపికా పడుకోణె.. 38 సంవత్సరాల వయసులో కూడా పదహారేళ్ల పడుచు పిల్లలా తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది.పైగా పఠాన్, జవాన్ లాంటి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా చిత్రాలతో సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది దీపికా. కల్కి తో కూడా మరో బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీలో దీపికా పడుకోణె నటిస్తోంది. మొత్తానికి పాన్ ఇండియా హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి దీపికా పడుకోణె గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ‘కల్కి’లో కూడా అమ్మడు తన బికినీల ఘాటు చూపించబోతుంది.

ట్రెండ్ కి తగ్గట్టుగా మోడరన్ డ్రెస్సులతో అందాలు ఆరబోసే దీపికా పడుకోణె ఫిట్ నెస్ కి ప్రాధాన్యత ఇస్తుంది. వర్కౌట్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటుంది. తాజాగా దీపికా పడుకోణె వర్కౌట్స్ అలాగే ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో అనేది సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రతి రోజు దీపికా పడుకోణె వర్కౌట్స్ లో ముందుగా కార్డియో స్ర్టెంత్‌ ట్రైనింగ్‌ యోగా ఉంటుందట. అందులో భాగంగా రన్నింగ్‌, సైక్లింగ్ లేదా డ్యాన్స్‌తో 45 నిమిషాల కార్డియో సెషన్ ఉంటుందట‌. వాటితో పాటుగా స్క్వాట్స్‌, పుషప్స్‌, లంగె, వెయిట్‌ లిఫ్టింగ్ లాంటివి కూడా దీపికా పడుకోణె ఫాలో అవుతుందట.

అంతేకాదు కాసేపు యోగా కూడా దీపికా పడుకోణె చేస్తుందట. ఒత్తిడిని అధిగ మించేదుకు ధ్యానం చేస్తుందట‌. ఇక డైట్ లో భాగంగా దీపికా పడుకోణె ఉదయం లేవగానే.. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, బ్రెడ్‌ టోస్ట్‌, అలాగే గ్రీన్ టీ తీసుకుంటందట‌. అలాగే, మధ్యాన్నం మాత్రం దీపికా పడుకోణె గ్రిల్‌డ్‌ చికెన్‌ లేదా వెజిటబుల్స్‌, బ్రౌన్‌ రైస్‌తో ఫిష్‌, సాయంత్రం స్నాక్స్ లో ప్రూట్ స్మూతీ, దానితో పాటుగా డ్రై ఫ్రూట్స్ లో బాదం, పిస్తా, జీడిప‌ప్పు తీసుకుంటుందట. మరి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే ఈ మాత్రం డైట్, అలాంటి వర్కౌట్స్ ఉండాల్సిందే కదా..! అందుకే, దీపికా పడుకోణె కూడా అదే ఫాలో అవుతుంది. ఇంతకీ దీపికా పడుకోణె గ్లామర్ సీక్రెట్ ఇదే అన్నమాట.

Also Read:మహిళల్లో థైరాయిడ్.. ఎంత ప్రమాదమో!

- Advertisement -