ఫుల్ స్వింగ్ లో దీపికా పదుకొణె!

30
- Advertisement -

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్లమార్గం ద్వారా కాలినడకన ఆమె కొండపైకి వెళ్లారు. రాత్రి తిరుమలలోనే బస చేసి.. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాగా, ప్రస్తుతం దీపికా తెలుగులో ప్రభాస్ కల్కి మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అన్నట్టు దీపికా మరో క్రేజీ సినిమాలో కూడా నటించబోతుంది.

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన యానిమల్‌ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల విడుదలై రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో దీపికా పదుకొణె నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో దీపికా పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందట.

ఈ సినిమాతో పాటు దీపికా లిస్ట్ లో ఎన్టీఆర్ సినిమా కూడా ఉంది. ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనెను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లు చాలా గ్రాండ్ విజువల్స్ తో ఉంటాయట. సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ లు మెయిన్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి దీపికా పదుకొణె టైమ్ నడుస్తోంది. ఆమె కెరీర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తోంది.

Also Read:సీతాఫలం తింటే ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -