షారుఖ్ కోసం దీపికా ఇంత చేసిందా?

29
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ – దీపికా పడుకోణె ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. పైగా వాళ్ళు పఠాన్, జవాన్ మూవీస్ తో ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. అంతకు ముందు నుంచే షారుఖ్ – దీపికా ఫ్రెండ్ షిప్ మైంటైన్ చేస్తున్నారు. అయితే ఎక్కువగా దీపికా, షారుఖ్ ఫ్యామిలీతో కలిసి కనిపించడం, అలాగే షారుఖ్ ఖాన్ – దీపికాలు కలిసి ఈవెంట్స్ కి వెళ్లడం, డిన్నర్ డేటింగ్స్ అంటూ హడావిడి చెయ్యడంతో అందరూ షారుఖ్ – దీపికా ఫ్రెండ్ షిప్ లో కాదు, రిలేషన్ లో ఉన్నారని అనుకుంటున్నారు. అదే విషయం వాళ్ళని అడిగితే మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటారు.

అదలా ఉంటే షారుఖ్ ప్రతి ఫ్యామిలీ పార్టీలో దీపికా కనిపిస్తోంది అంటూ ఆ మధ్య గుట్టు బయటికి రావడంతో దీపికా, షారుఖ్ ఖాన్ మధ్యలో కచ్చితంగా ప్రేమే ఉంది అంటున్నారు. ఇక తాజాగా దీపికా పదుకొణె తన ఫ్రెండ్ షారుఖ్ ఖాన్ బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ సినిమాలతో పాటుగా.. ముంబైలో ఓ హోటల్ కూడా నడుపుతున్నాడు. ఈ హోటల్ ను కూడా నాలుగేళ్ళ క్రితం దీపికానే ఓపెన్ చేసింది. పైగా తన సినిమాల నిర్మాతలకు కూడా ఈ హోటల్ నే బుక్ చేయమని రికమండ్ చేస్తోందట. ఇదంతా చూస్తుంటే.. దీపికా – షారుఖ్ మధ్య స్నేహానికి మించిన బంధం ఏదో ఉందని అంటున్నారు.

మొత్తానికి ఇదంతా విని షారుఖ్ ఖాన్ కోసం దీపికా ఎంతగా కష్ట పడిపోతుందో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి బాలీవుడ్‌ హీరో రణ్ వీర్ సింగ్ ను దీపికా పడుకోణె పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. పైగా ఆమె త్వరలో తల్లి కాబోతుందని.. తన అభిమానులకు ఆ తీపి కబురు చెప్పబోతుందని తాజాగా సోషల్ మీడియాలో బాగా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో షారుఖ్ తో రిలేషన్ అంటూ వార్తలు రావడం ఆశ్చర్యకరం.

Also Read:ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ ఉన్నట్లే..జాగ్రత్త!

- Advertisement -