బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో షాకింగ్ నిజాలు..

257
Drugs Case
- Advertisement -

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసును ఎన్సీబీ విచారిస్తున్న విష‌యం తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో జరుగుతున్న విచారణలో భాగంగా డ్రగ్స్ కేసును లోతుగా విచారిస్తున్న ఎన్సీబీ (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రశ్నించింది. ఈ రోజు ఈ కేసు విచారణకు దీపిక పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ హాజరయ్యారు. ఉదయమే ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న దీపిక శ్రద్ధా, సారా అలీ ఖాన్‌లను ఎన్సీబీ విచారిస్తోంది. దీపికకు, కరిష్మా మధ్య చాటింగ్‌పై ప్రశ్నిస్తున్న ఎన్సీబీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీపిక పదుకొణె ఇచ్చిన సమాధానాలు అంతగా సంతృప్తికరంగా లేవని ఎన్సీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కరిష్మాతో సాధారణ సంబంధాలు తప్ప డ్రగ్స్ సంబంధాలు లేవని దీపిక పదుకొణె ఎన్సీబీ అధికారులకు చెప్పినట్టు సమాచారం.

ఈ కేసులో మ‌రో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. డ్ర‌గ్స్ కేసులో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ కిటిజ్‌ ర‌విప్ర‌సాద్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ర‌విప్ర‌సాద్‌ను కూడా శుక్ర‌వారం విచారించారు. ఇవాళ కిటిజ్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ఎన్సీబీ అధికారులు చెప్పారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న విచార‌ణ‌లో ర‌విప్ర‌సాద్ పేరును వెల్ల‌డించిన‌ట్లు కూడా తెలుస్తోంది. ఇక మరో బృందం శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తోంది. జయ సాహాకు మధ్య చాటింగ్‌పై ఎన్సీబీ శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే 2019 నాటికి కరోణ్ జోహర్ ఇచ్చిన పార్టీపై ఎన్సీబీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణకు హాజరైన శ్రద్ధా కపూర్ చెప్పడంతో.. ఈ పార్టీలో ఎవరెవరూ పాల్గొన్నారనే దానిపై ఎన్సీబీ ఫోకస్ చేస్తోంది.

అయితే ధ‌ర్మ ప్రొడెక్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ శుక్ర‌వారం డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. ర‌విప్ర‌సాద్‌తో త‌న‌కు ప‌రిచ‌యం లేద‌ని, వ్య‌క్తిగ‌తంగా అత‌ను త‌న‌కు తెలియ‌ద‌ని క‌ర‌ణ్ పేర్కొన్నారు. త‌న ఇంట్లో కూడా ఎటువంటి డ్ర‌గ్స్ పార్టీ జ‌ర‌గ‌లేద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ధ‌ర్మ ప్రొడెక్ష‌న్స్‌తో సంబంధం ఉన్న ధ‌ర్మాటిక్ ఎంట‌ర్‌టైన్మెంట్‌లో ర‌విప్ర‌సాద్ 2019 న‌వంబ‌ర్‌లో చేరారు. డ్ర‌గ్స్ స్పెష‌లిస్టు ఆఫీస‌ర్ స‌మీర్ వాంఖ‌డే శ‌నివారం ర‌విప్ర‌సాద్‌ను విచారించారు. దాని త‌ర్వాత‌నే అత‌న్ని అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. ర‌వి ప్ర‌సాద్ త‌న విచార‌ణ‌లో అయిదుగురు బాలీవుడ్ సెల‌బ్రిటీల పేర్ల‌ను, మ‌రో ఇద్ద‌రు ప్రొడ్యూస‌ర్ల పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టన‌ట్లు ఎన్సీబీ వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న‌ది.

- Advertisement -