తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్‌కు పూలమాల వేసి నివాళులు అర్పించారు కేటీఆర్ మరియు ఇతర నేతలు.
తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, 2009 నుంచి 2023 వరకు జరిగిన ఉద్యమం, స్వరాష్ట్ర సాధన, గెలుపు, పదేళ్ల సంక్షేమంపై చిత్ర ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు.
దీక్షా దివస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కేటీఆర్, నేతలు. అనంతరం దీక్షా దివస్ డాక్యుమెంటరీని ఆవిష్కరించి వీక్షించారు కేటీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ అమర వీరులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, బండ ప్రకాశ్, నగర ప్రజాప్రతినిధులు.
Also Read:ఆఫ్ఘాన్ ప్రయాణీకుల వీసా నిలిపివేత

