డివిలియర్స్ రికార్డు బ్రేక్ చేసిన డికాక్

5
- Advertisement -

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్–బ్యాటర్ క్వింటన్ డి కాక్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘానిస్తాన్‌పై 41 బంతుల్లో 59 పరుగులు చేసిన డి కాక్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఆయన ఏబీ డివిలియర్స్ రికార్డును అధిగమించాడు.

ఇప్పటివరకు డివిలియర్స్ 30 మ్యాచ్‌లలో 717 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, డి కాక్ 29 మ్యాచ్‌ల్లో 737 పరుగులతో ముందంజలో నిలిచాడు.

టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

క్వింటన్ డి కాక్ – 737

ఏబీ డివిలియర్స్ – 717

జేపీ డ్యూమినీ – 568

డేవిడ్ మిల్లర్ – 482

ఐడెన్ మార్క్రామ్ – 448

డి కాక్, ర్యాన్ రికెల్టన్‌తో కలిసి 114 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

Also Read:మున్సిపల్ ఎన్నికలు..ఉద్రిక్త పరిస్థితులు

- Advertisement -