- Advertisement -
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చిస్తామని సీఈసీ రావత్ తెలిపారు. అసెంబ్లీ రద్దైన తర్వాత వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలన నిబంధన ఉందన్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఛత్తీస్ గఢ్,రాజస్థాన్,మధ్యప్రదేశ్,మిజోరాం రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అంశంపై చర్చించనున్నారు.
మరోవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అవసరాలపై సమీక్ష నిర్వహించిన రజత్ కుమార్ ఈవీఎంలు,వీవీప్యాట్‌లపై పూర్తి స్ధాయి అవగాహన కల్పించేందుకే ఈ సమావేశం నిర్వహించామన్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించే నాటికి తాము అన్నివిధాలా సిద్ధంగా ఉంటామన్నారు.
- Advertisement -