ప్రముఖ నటి మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించడంతో సుప్రీం కోర్టు జడ్జిల తీర్పుపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతుంటే.. ప్రముఖ నటి మంచు లక్ష్మి నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించటాన్ని తప్పుపట్టడం సంచలనంగా మారింది. అతి కిరాతకంగా.. క్రూరంగా అత్యాచారానికి పాల్పడిన దోషులను ఉరే సరి అంటూ నిర్భయ దోషులపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి పాశవిక చర్యలు భవిష్యత్‌లో జరగకుండా ఉండాలంటే నిర్భయదోషులకు మరణశిక్షే సరైనదని సుప్రీంకోర్టు భావించింది.
అయితే మంచులక్ష్మి నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించడంపై తనదైన శైలిలో స్పందించింది. ఇటీవల చిల్డర్స్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె నరరూప రాక్షసుల్లాంటి నిర్భయ హంతకులకు ‘సమాజంలో వారు చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ఓ అవకాశం ఇచ్చిచూడాలని’ సంచలన కామెంట్స్ చేశారు. ఒకవైపు దోషులకు మరణ శిక్షవిధించడంతో న్యాయం గెలిచిందని అనిపించినా మరోవైపు వారిని చంపేయడం వల్ల ఏ ఉపయోగం అన్నారు.
నిర్భయ దోషులు అవగాహనా లోపంతోటే.. ఈ క్రూరమైన చర్యకు పూనుకున్నారని అందువల్ల వారికి అవగాహన వచ్చే విధంగా పశ్ఛాత్తాప పడేవిధంగా అవకాశం ఇవ్వాలన్నారు. ఆడదిఅంటే ఆట బొమ్మ మాత్రమే కాదిని వారికి తెలిసేలా చేయాలన్నారు. టోటల్ ఇండియా సిస్టమ్ అంతా అక్కడక్కడ నుండి తీసుకుని మేల్ సొసైటీ కంట్రీగా తయారుచేశారని సిస్టమ్‌నే తప్పుబట్టింది మంచులక్ష్మి. హిందూ దేవతలను పూజించే మన దేశంలో ఒక అమ్మాయిని తక్కువ చేసి చూడటం దేశానికే సిగ్గుచేటు అన్నారు.
ఇలాంటి వన్నీ అవేర్‌నెస్ లోపం వల్లే జరుగుతున్నాయని.. వాస్తవానికి ఇలాంటి విషయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని.. తనకు అన్నీ ఉన్నాయి కదా అని వెనకడుగు వేయనని అన్నీ ఉన్నాయి కనుకనే ముందుకు వస్తున్నానని ఇంట్లో కూర్చుని చూస్తూ ఊరుకునే మనస్తత్వం తనది కాదన్నారు అన్నారు మంచులక్ష్మి.
మొత్తానికి నిర్భయ హంతకులకు ఉరిశిక్ష పడటంతో న్యాయం గెలిచిందని.. ఇలాంటి దుర్మార్గులపై ఎంతమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని యావత్ భారత దేశం భావిస్తుంటే .. మంచు లక్ష్మి నిర్భయ నిందితులకు బ్రతికేందుకు ఓ అవకాశం ఇచ్చి చూడాలంటూ చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.