విజయ్ దేవరకొండ – రష్మిక మందన జోడిగా తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’.మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ ఈ మూవీని నిర్మించగా భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. గీతా గోవిందంతో ఆకట్టుకున్న విజయ్-రష్మిక ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టారా…?తొలి సినిమానే అయినే భరత్ కమ్మ ..డియర్ కామ్రేడ్‌ను ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మలిచాడా లేదా చూద్దాం..
కథ :
బాబీ (విజయ్ దేవరకొండ)కు విప్లవ భావాలు ఎక్కువ. న్యాయం కోసం పోరాడే వ్యక్తి. తొలిచూపులోనే క్రికెట్ ప్లేయర్ లిల్లీ (రష్మిక)ను ఇష్టపడతాడు. బాబీని ప్రేమించిన లిల్లీకి అతనికి ఆవేశం ఎక్కువ అనే విషయం తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే వీరిద్దరు విడిపోతారు. తర్వాత ఏం జరుగుతుంది…?బాబీ-లిల్లీ ఎలా ఒక్కటవుతారు..?అసలు డియర్ కామ్రేడ్ టైటిల్‌కు కథకు లింకేంటి అనేది తెరమీద చూడాల్సిందే.
పస్ల్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,విజయ్ దేవరకొండ,పాటలు.విజయ్ దేవరకొండ తనదైన నటనతో మెస్మరైజ్ చేశాడు. ఆవేశంతో రగిలిపోయే పాత్రలో విజయ్ అందరినీ మెప్పిస్తాడు. స్టూడెంట్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు విజయ్. ఇక సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది రష్మిక. విజయ్‌తో పోటీ పడి నటించింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. మిగితా నటీనటులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.ముఖ్యంగా కడలల్లే పాట సినిమాకే హైలెట్.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథనం, స్లో నేరేషన్. ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో వచ్చే పలు సీన్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. తొలి సినిమానే అయినా తాను రాసుకున్న కథను ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు భరత్ కమ్మ. జస్టిన్ ప్రభాకరన్ అందించిన పాటలు, సంగీతం బాగున్నాయి. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ బాగుంది. మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
గీతాగోవిందంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న జోడి విజయ్ దేవరకొండ-రష్మిక. తాజాగా మరోసారి అదేజోడితో దర్శకుడు భరత్ కమ్మ చేసిన ప్రయత్నమే డియర్ కామ్రేడ్. కథ,విజయ్ నటన సినిమాకు ప్లస్ కాగా అక్కడక్కడ స్లో నేరేషన్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా డియర్ కామ్రేడ్‌గా ప్రేక్షకులను మెప్పించాడు విజయ్.ఈ వీకెండ్‌లో అంతా చూడదగిన చిత్రం డియర్ కామ్రేడ్.
విడుదల తేదీ:26/07/2019
రేటింగ్:2.75/5
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
నిర్మాత : మైత్రి మూవీ మేకర్స్
దర్శకత్వం : భరత్ కమ్మ