లే పంగా…కూతకు సిద్ధమైన విరాట్..!

217
virat

ప్రో కబడ్డీ లీగ్ సీజన్‌ 7 నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ప్రొ కబడ్డీకి విస్తృత ప్రచారం కల్పిస్తుండగా తాజాగా టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లే పంగా అనేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 27(రేపు) శనివారం ముంబైలో జరిగే తొలిమ్యాచ్‌కు అతిథిగా రానున్నాడు.

జాతీయ గీతం ఆలపించి యు ముంబా, పునేరి పల్టాన్‌ మధ్య మ్యాచ్‌ను ప్రారంభించనున్నాడు కోహ్లీ. ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది ప్రో కబడ్డీ మేనేజ్‌మెంట్. 2016లో ప్రొ కబడ్డీ లీగ్ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్నారు కోహ్లీ.

ప్రపంచకప్‌లో సెమీస్‌ నుంచి వైదొలిగి తర్వాత కోహ్లీ తొలిసారిగా ప్రొ కబడ్డీ లీగ్‌లో దర్శనమివ్వనున్నాడు. ఆగస్టు 3 నుంచి టీమిండియా వెస్టిండీస్‌ టూర్ వెళ్లనుంది. నెల రోజుల పాటు మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మూడు ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.