డియర్ కామ్రేడ్ సరికొత్త రికార్డ్

460
dear comrade
- Advertisement -

విజయ్ దేవరకొండ రష్మీక మందన జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మూడు భాషల్లో విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈచిత్రం తెలుగులో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మలయాళంలో మాత్రం పర్వాలేదు అనిపించుకుంది. డియర్ కామ్రేడ్ ఘోరంగా విఫలమవడంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తెలుగులో ఫ్లాపైన ఈ మూవీ హిందీలో మాత్రం రికార్డు సృష్టిస్తుంది. డియర్ కామ్రేడ్‌ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు.

సినిమా స్టోరీతో పాటు విజయ్ యాక్టింగ్, విజయ్-రష్మిక రొమాన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. జనవరి 19న యూబ్యూబ్‌లో విడుదలైన డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ వర్షన్ రికార్డుల మోత మోగిస్తోంది. 24 గంటల్లోనే 12 మిలియన్లు వ్యూస్ సాధించిది డియర్ కామ్రేడ్. గోల్డ్‌మైన్స్ టెలీఫిలింస్ సంస్థ ‘డియర్ కామ్రేడ్’ హిందీ అనువాద హక్కులను కొనుగోలు చేసింది. ఇప్పటికైతే 16.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సినిమాలోని కంటెంట్‌కు హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోతున్నారు.

- Advertisement -