డియర్ కామ్రేడ్ తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా…?

428
dear comrade
- Advertisement -

గీతా గోవిందం ఫేమ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్‌. విజయ్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతిచోట పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజు ఏపీ,తెలంగాణతో పాటు యుఎస్‌,దక్షిణాది రాష్ట్రాలతో కలిపి రూ. 17.9 కోట్ల వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ అగ్ర నిర్మాత ఈ మూవీ హిందీ రిమేక్ రైట్స్‌ని సొంతం చేసుకున్నారు.

నైజాం: 3.02 కోట్లు,సీడెడ్: 0.88 కోట్లు ,వైజాగ్: 0.89 కోట్లు,ఈస్ట్: 0.90 కోట్లు ,వెస్ట్: 0.53 కోట్లు ,కృష్ణ: 0.38 కోట్లు ,గుంటూరు: 0.62 కోట్లు, నెల్లూరు: 0.26 కోట్లు రాబట్టింది. సినిమా చాలా బాగుందని విజయ్ దేవరకొండ,రష్మిక నటన సూపర్బ్ అని చెబుతున్నారు. తెరపై విజయ్‌-రష్మిక కెమిస్ట్రి అద్భుతంగా ఉందని,దర్శకుడు భరత్ కమ్మ తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారని కొనియాడుతున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందడమే గాక ఒకేరోజు విడుదలవ్వడం విశేషం. స్వచ్చమైన ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా లో బడ్జెట్‌లో తెరకెక్కగా ఈ వీకెండ్‌లో మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -