హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే – నటి డింపుల్ హయతి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. డీసీపీ డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు.ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
దీనిపై స్పందించారు డీసీపీ రాహుల్. డింపుల్ తాను ఒకే అపార్టుమెంట్లో ఉంటున్నామని.. తాను పార్క్ చేసే స్థలంలో తన కారుకు ఆమె అడ్డు పెడుతుందని, తాను పోలీస్ కాబట్టి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆ సమయంలో తన అధికారిక వాహనానికి అడ్డుపెట్టి ఇబ్బంది పెడుతుందని చాలాసార్లు చెప్పి చూశానని తెలిపారు.
Also Read:WhatsApp:చాట్ లాక్
తన వాహనాన్ని ఢీ కొట్టి ఆపై కాలుతో తన్నిందన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయన్నారు. చాలాసార్లు చెప్పిచూసిన ఆమె తీరు మారకపోవడంతో తన డ్రైవర్ చేతన్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పును కప్పి పుచ్చినట్లు ఆమె ట్విట్ చేసిందని, తనకు, డింపుల్‌కు వ్యక్తి గత గొడవలు ఏమి లేవన్నారు. ఆమె ఆరోపణలపై పోలీస్ విచారణలో అన్ని విషయాలు బయట పడతాయని అన్నారు.
Also Read:హ్యాపీ బర్త్ డే..చంద్రమోహన్