ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ…

37
dc

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంఆ చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌కు గట్టి షాకిచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. పటిష్టమైన ముంబైపై విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆడుతూ పాడుతూ గెలుపొందింది. 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కొల్పోయి 138 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ధావన్(45), ఆసీస్ స్టార్ ఆటగాడు స్మిత్(33) రాణించడంతో ఢిల్లీ విజయం సునాయసమైంది.

అంతకముందు టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలో ధాటిగా ఆడిన తర్వాత ఒక్కసారిగా టాప్ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. రోహిత్ శర్మ ,సూర్యకుమార్ యాదవ్ 2,ఇషాన్ కిషన్ 26 పర్వాలేదనిపించారు. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది.