- Advertisement -
లాక్‌డౌన్‌కి ముందు క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాట్‌తో బౌండరీలతో చెలరేగిన ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాడు.
తాజాగా మహేశ్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్‌కు స్టెప్పులేశాడు వార్నర్. ఇందులో తన భార్యతో కలిసి వార్నర్ చేసిన ఫ్యాన్స్ నిజంగానే మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. 50 టేకుల తర్వాత ఇది సాధ్యమైంది పేర్కొన్నాడు వార్నర్.
ఇప్పటివరకు వార్నర్ చేసిన బుట్టబొమ్మ సాంగ్, పొకిరి డైలాగ్, బాహుబలి సాంగ్‌కు మంచిరెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
- Advertisement -